V1News Telangana

best news portal development company in india

ఎన్టిపిసిలో ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులకు సేఫ్టీ కరువు … వలస వచ్చిన కార్మికులకు సరైన సేఫ్టీ అందించని యాజమాన్యం 

SHARE:

ఎన్టిపిసిలో ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులకు సేఫ్టీ కరువు

వలస వచ్చిన కార్మికులకు సరైన సేఫ్టీ అందించని యాజమాన్యం

పైనుండి పడి మృతి చెందిన ఒడిశాకు చెందిన ప్రైవేట్ కార్మికుడు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జూన్ 12:-

బుధవారం ఉదయం ఎన్ టి పి సి 6th యూనిట్ ఈ ఎస్ పి పాస్ డి దగ్గర పనిచేస్తున్న ఒడిసాకు చెందిన కార్మికుడు అర్జున్ మారండి అనే కార్మికుడు పనిచేస్తున్న క్రమంలో సరైన సేఫ్టీ లేకపోవడంతో పైనుండి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే పని చేస్తున్న సదరు కార్మికులు అతనిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఎన్టిపిసి యాజమాన్యం కాంట్రాక్టర్లు పని కోసం ఇక్కడకు వలస తీసుకుని వచ్చి చాలీ చాలని జీతంతో పని చేస్తున్న కార్మికుల పట్ల అశ్రద్ధ చూపుతున్నట్లు పలువురు కార్మిక నాయకులు మండిపడుతున్నారు. సరైన సేఫ్టీ లేకపోవడం వల్లే కార్మికుడు పై నుండి పడి చనిపోయాడని దీనిపై యాజమాన్యం స్పందించాలని కోరుతున్నారు. కాంట్రాక్ట్ కార్మిక యూనియన్ నాయకులు యాజమాన్యంకి చనిపోయిన వ్యక్తికి కుటుంబానికి న్యాయం చేయాలని మండిపడుతున్నారు. అయితే చనిపోయిన వ్యక్తికి ఎక్స్రేషియా 50 లక్షలు రూపాయలు అలాగే దహన సంస్కారాల కింద లక్ష రూపాయలు మరియు డెడ్ బాడీ ఒడిస్సా కు ట్రాన్స్పోర్టింగ్ ఖర్చులు అతని కుటుంబంలో ఎన్ టిపిసి లో కాంట్రాక్టు కార్మికునిగా లొకేషన్లో పని ఇవ్వాలని డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india