V1News Telangana

best news portal development company in india

మిషన్ భగీరథ మంచినీటి సరఫరా, పబ్లిక్ హెల్త్ అంశాలపై సమీక్షా సమావేశం…..

SHARE:

కామారెడ్డి జిల్లా: గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మంగళవారం రోజు కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత వాటర్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మంచినీటి సరఫరా పై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, జిల్లా పంచాయతీ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైప్ లైన్ లీకేజీ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, గుర్తించి పరిష్కరించాలన్నారు. ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india