V1News Telangana

best news portal development company in india

మండల వ్యాప్తంగా మొదలైన మిషన్ భగీరథ కుళాయిల సర్వే…

SHARE:

కామారెడ్డి జిల్లా:నసురుల్లాబాద్ మండలంలోని కాంషెట్ పల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మిషన్ భగీరథ పథకంలో భాగంగా మంగళవారం రోజు ఎం.పి.ఓ రాము పర్యవేక్షణలో గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు సిబ్బందితోపాటు ఇంటింటికి తిరుగుతూ సర్వే నిర్వహించారు. దీనిలో భాగంగా మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన కుళాయిలు గ్రామం మొత్తంలో ఎన్ని ఉన్నాయని, ఉన్నవారికి త్రాగు నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందా లేదా అన్న అంశాలపై సర్వే నిర్వహించారు. త్రాగు నీటి సరఫరా జరగని ప్రదేశాలలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా పంచాయతీ కార్యదర్శి మరియు పారిశుధ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామ మొత్తంలో ఉన్నటువంటి మిషన్ భగీరథ కుళాయిల వివరాలను పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేసి ఎం.పీ.డీ.వో కార్యాలయానికి సమర్పించవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శశిధర్, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india