V1News Telangana

best news portal development company in india

అధికారులకు సన్నిహితంగా ఉన్న జూనియర్లకు ప్రమోషన్ సీనియర్ లకు ప్రమోషన్ గాలికి పెట్టిన అధికారులు 

SHARE:

అధికారులకు సన్నిహితంగా ఉన్న జూనియర్లకు ప్రమోషన్ సీనియర్ లకు ప్రమోషన్ గాలికి పెట్టిన అధికారులు

సీనియర్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదనతో చిమ్ని ఎక్కిన సీనియర్ కార్మికులు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది పెద్దపల్లి బసంత్ నగర్ జూన్ 10:-

వసంత నగర్ సిమెంట్ కర్మాగారంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్న సీనియర్ కార్మికులకు ప్రమోషన్ ఇవ్వకుండా అధికారులకు సన్నిహితంగా ఉన్న జూనియర్లకు ప్రమోషన్ ఇవ్వడంపై సీనియర్ కార్మికులు మండిపడుతున్నారు. గత కొంతకాలంగా వసంత నగర్ సిమెంట్ కర్మాగారంలో కొనసాగుతున్న తతంగం సీనియార్టీకి ప్రమోషన్ కల్పించకుండా జూనియర్లకు ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జూనియర్లకు, సన్నిహితులకు ప్రమోషన్లు కల్పిస్తూ సీనియర్లకు అన్యాయం చేస్తున్నారని 20 మంది కాంట్రాక్టు కార్మికులు చిమ్ని ఎక్కి నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో కాంట్రాక్టు కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ప్రమోషన్లు, బేసిక్ లో సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యతను ఇస్తున్నారని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియారిటీ ప్రకారం బేసిక్ నిర్ణయించాల్సింది పోయి అధికారులకు అనువుగా ఉండే జూనియర్లకు ఎక్కువ బేసిక్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం చొరవ తీసుకొని సీనియర్లకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై యాజమాన్యం, కాంట్రాక్టర్ తో చర్చించి సీనియర్లకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు నిరసనను విరమించి కిందికి దిగారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india