V1News Telangana

best news portal development company in india

“”అమ్మ ఆదర్శ పాఠశాల'” నిధుల పైన అధికారుల పర్యవేక్షణ ఎంతవరకు…

SHARE:

“”అమ్మ ఆదర్శ పాఠశాల'” నిధుల పైన అధికారుల పర్యవేక్షణ ఎంతవరకు…

చాలీచాలని నిధులతో పాఠశాలలో మౌలిక వసతుల కల్పన జరుగునా…?

తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ (TNSF) &
బీసీ సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి పుట్ట భాస్కర్

V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “‘అమ్మ ఆదర్శ పాఠశాల'”అనే పేరుతో పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రాష్ట్రం లో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికి, ప్రభుత్వం కొన్నిరోజుల క్రితం నిధులను విడుదల చేసింది… ఈ క్రమంలో నసురుల్లాబాద్ మండల వ్యాప్తంగా ప్రభుత్వ నిధులతో ఇప్పటివరకు కొన్ని పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి….కొన్ని చోట్ల ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు మొదలు కాలేదు, వేసవి సెలవులు ముగించుకొని మరో రెండు రోజుల్లో బడులు పునః ప్రారంభం కాబోతున్నాయి, ఆ గడువు లోపు పూర్తి కావాల్సిన పనులు ఇప్పటివరకు చాలా చోట్ల మొదలుకాలేదు… ప్రభుత్వం విడుదల చేసిన అర కొర నిధులతో పనులు అసంపూర్తిగా మధ్యలోనే ఉన్నాయి… ఈ నిధుల పైన ప్రభుత్వ అధికారుల యొక్క పర్యవేక్షణ కూడా అంతంత మాత్రమే ఉంది… నిరుపేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల కల్పనలో భాగంగా ముఖ్యంగా ఆడపిల్లల కోసం టాయిలెట్స్ ను నిర్మించవలసిందిగా తెలుగునాడు విద్యార్థి సంఘం యువజన కార్యదర్శి పుట్ట భాస్కర్ తెలిపారు. పాఠశాలల్లో ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేసి మౌలిక వసతులను కల్పించవలసిందిగా ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు .

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india