V1News Telangana

best news portal development company in india

గ్రూప్ -1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్….

SHARE:

కామారెడ్డి జిల్లా: గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్/పరీక్షల నోడల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి గురువారం రోజు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి రాష్ట్రస్థాయి ఉన్నత అధికారులతో కలిసి జిల్లాల అదనపు కలెక్టర్లు అదనపు ఎస్పీలు పోలీస్ నోడల్ అధికారులు రీజినల్ కోఆర్డినేటర్ లతో జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 పరీక్ష విధివిధానాల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో, బాధ్యతగా విధి నిర్వహణను చేపట్టాలని తెలిపారు. ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా పరీక్షలను నిర్వహించడానికి అందరూ సహకరించాలని ఆదేశాలు జారీ చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india