V1News Telangana

best news portal development company in india

రాష్ట్ర ఆవిర్భావ.. అనే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ…..

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని జాతీయ పతాక ఆవిష్కరణ తహసిల్దార్ ఎల్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. గ్రామపంచాయతీ కార్యాలయం మరియు ఐకెపి మహిళా సమాఖ్య అధ్యక్షురాలి చేతుల మీదుగా పతాకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. 60 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎందరో త్యాగదనులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india