V1News Telangana

best news portal development company in india

యువకులు అడ్డుకున్నారు అధికారులు సిజ్ చేసారు….. పర్మిషన్ ముసుగులో దో నెంబర్ దందా……

SHARE:

గత కొద్దీ రోజుల నుండి రుద్రూర్ మండలం రైకూరు గ్రామంలో గల గుట్ట ప్రాంతం నుండి మొఱ్ఱం త్రవకలు చేస్తూ సిధాపూర్,పెగడపల్లి,పెంట కుర్డు, గ్రామ లో అమ్మకాలు కొందరు మొఱ్ఱం మాఫియా రాయులు చేస్తున్నారు.అయితే వారికి పర్మిషన్ ఉందని అందరు అనుకున్నారు పట్టపగలు వాహనాలు వెళ్తే ప్రభుత్వ పనులకు రెవిన్యూ అధికారులు పెర్మిషన్ ఇచ్చారనుకొని స్థానిక ప్రజలు అనుకున్నారు,అయితే ఈ రోజు రుద్రూర్ మండలం సిధాపూర్ గ్రామానికి చెందిన కొందరు యువకులు మొఱ్ఱం తో నిండి వెళ్తున్న టిప్పర్ ను ఆపేసారు. టిప్పర్ లు వెళ్లడం వలన తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతునాయని స్థానికులు ఆ టిప్పర్లను ఆపారు. వెంటనే స్థానిక రెవిన్యూ అధికారి అయినటు వంటి తహసీల్దార్ కు ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇవ్వగ అయన వచ్చి ఆ మొఱ్ఱం రవాణా చేస్తున్నా వాహనాలను అదుపులో తీసుకున్నారు. మొఱ్ఱం త్రవాకాలకు ఎటువంటి పర్మిషన్ లేదని వారు ఇష్టం రాజ్యం చాలయిస్తున్నారని అక్రమ మొఱ్ఱం రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని రుద్రూర్ తహసీల్దార్ మొఱ్ఱం మాఫియాను హెచ్చరించారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india