సాలురా తాసిల్దార్ కార్యాలయంలో ఆ సారు బిగ్బాస్ అవతారం ఎత్తారా
అక్రమ ఇసుక మొరం వ్యవహారంలో వసూళ్ల పర్వంలో ఆ సారుదే పై చేయి అన్న విమర్శలు
తహసిల్దార్ కార్యాలయంలో అన్ని నేనే అన్న చందంగా వ్యవహరిస్తూ ఇసుక . మొరం తరలింపులో ప్రధాన పాతదారుడుగా సూత్రధారులుగా చలామణి అవుతున్నారని విమర్శలు..

ఆ సార్ కు రాయడం చదవడం రాదని విమర్శలు
అందుకే తహసిల్దార్ కార్యాలయంలో సంబంధంలేని వ్యక్తితో ఇసుక వ్యవహారాల వద్ద పనులు పెట్టి వసుళ్ల పర్వంలో ముఖ్య పాత్రుడిగా పేరుగాంచిన పరిస్థితులు నెలకొన్నాయి అనే ఆరోపణలు
మండలం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆసారే కొనసాగుతున్నారు బదిలీ లేదు ఇక్కడే ఉంటూ వసుళ్ళ పర్వంలో కింగ్ గా వ్యవహరిస్తున్నారని విమర్శలు
మామూళ్లు ఇవ్వకపోతే ఎవరైనా పై ఆఫీసులకు ఫిర్యాదు చేస్తే సక్రమంగా ఇసుక తరలించే వారిపై వేటు వేయడం ఆయన లక్ష్యం అనే ఆరోపణలు
ఇసుక మాఫియాదారులకు ఆసారే సర్వం
మండల కేంద్రంలో ఆ సారు ఇసుక తరలింపులో ప్రధాన పాత్రులుగా పేరుగాంచారు అనే విమర్శలు
అనేక ఏళ్ల నుంచి ఇసుక మాఫియా దారులకు సహకారంతోపాటు వసూళ్లతో పాటు ఇసుక తరలింపు అడ్డాకు ఆ సారు ప్రధాన పాత్రులుగా పేరు ప్రతిష్టలు సంపాదించారు అనే ఆరోపణలు..
సాలురా
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలుర మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఓ సారు బిగ్ బాస్ గా వ్యవహరిస్తూ అన్ని సర్వం తానే అన్న చందంగా వ్యవహరిస్తూ ఇసుక మాఫియాకు , అక్రమ ఇసుక తరలింపుకు ప్రధాన పాత్రధారుడిగా ,సూత్రధారిగా చలామణి అవుతూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శలు లేకపోలేదు. ఆ సారుకు రైటింగ్ పవర్ లేదని చదవడం రాదని అయినా ఉద్యోగం సంపాదించారని, పుకార్లు సికార్లు అవుతుండగా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఆ సారు తాసిల్దార్ కార్యానికి సంబంధం లేని వ్యక్తిని ఒక సర్వెంట్ గా ఉంచుకొని ఆయన ద్వారా ఇసుక తరలింపు వసూళ్ల పర్వం జోరుగా కొనసాగిస్తున్నారని విమర్శలు లేకపోలేదు. ఏండ్ల నుంచి ఇసుక అక్రమ రవాణా కావడంలో ఆయన పాత్రధాడు సూత్రధారుడిగా చలామణి అవుతున్నారని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మండలమైనప్పటి నుంచి సారు ఆఫీస్ లోనే కొనసాగుతున్నారని బదిలీ కాకుండా ఇక్కడే ఉంటూ ఇసుక తరలింపులో ముఖ్య పాత్రుడిగా పేరుగాంచారు అనే విమర్శలు లేకపోలేదు. ఇసుక తరలింపులో ఇసుక మాఫి యా దారులు ఎవరైనా మామూలు ఇవ్వనిచో లేకపోతే ఆయన గురించి పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తే ,వారిపై టార్గెట్ పెట్టి ,వారు సక్రమంగా ఇసుక తరలిస్తున్నప్పటికీ వారిపై వేటు వేసి ఇసుక తరలింపును అడ్డుకునే యత్నాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న ,ఆ సారు వైఖరి రోజురోజుకు మితిమీరి పోతుందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు. అలాంటి సారు మాకొద్దని సాలుర మండలం నుంచి ఇతర మండలానికి బదిలీ చేస్తే ఇసుక మాఫియా జరగదని అక్రమ ఇసుక దందా జరగదని వాల్టా చట్టం కూడా కాపాడబడుతుందని ప్రజలు భావిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏండ్ల నుంచి తాసిల్దార్ కార్యాలయంలోనే తానే సర్వం అన్న చందంగా వ్యవహరిస్తూ ఆధిపత్య పోరు చలాయిస్తున్న అలాంటి అధికారి అవసరమా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు పగలు రాత్రి తేడా లేకుండా సాలురాతో పాటు చుట్టుపక్క మంజీరా సరిహద్దు ప్రాంతాల మంజీరా నదుల నుంచి అక్రమంగా ఓవర్ లోడ్ తో తరులుతున్న ఇసుక అక్రమ రవాణాకు ప్రధాన పాత్రధారుడిగా, సూత్రధాడిగా ఉన్న ఆ సారుపై , పై స్థాయి అధికారులు వేటు వేస్తారా లేక బదిలీ చేస్తారా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలని ప్రజలు భావిస్తున్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








