V1News Telangana

best news portal development company in india

పోలింగ్ రోజు మే -13న వేతనంతో కూడిన సెలవు పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్

SHARE:

పోలింగ్ రోజు మే -13న వేతనంతో కూడిన సెలవు పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది పెద్దపల్లి, మే- 11:

మే 13న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించిందని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు.మే 13న సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, వాణిజ్య సంస్థలు, దుకాణం, వ్యాపార సంస్థలలో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని, ఈ సందర్భంగా అందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆ ప్రకటనలో తెలిపారు. 

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india