V1News Telangana

best news portal development company in india

రేషన్ షాపుల వద్ద బియ్యాన్ని కొంటున్న రేషన్ దళారులపై అధికారుల తెర పడుతుందా దళారులు

SHARE:

రేషన్ షాపుల వద్ద బియ్యాన్ని కొంటున్న దళారులు

రేషన్ దళారులపై అధికారుల తెర పడుతుందా

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం మే 11:-

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత కొద్ది రోజులుగా రేషన్ షాపుల వద్ద బియ్యాన్ని కొంటున్న దళారులు గతంలో ఇంటింటికి తిరుగుతూ కిలో 8 రూపాయల నుంచి పది రూపాయల వరకు కొనేవారు. కానీ ఈమధ్య రేషన్ షాపుల వద్ద 10 నుంచి 15 రూపాయలకు కొంటున్నట్లు విశ్వసనీయమైన సమాచారం. రామగుండం పరిసర ప్రాంతాలలో ఉన్న రేషన్ షాపుల వద్ద అక్రమంగా దలారులు రేషన్ బియ్యాన్ని కొంటూ పోగు చేసుకొని ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ధరాలకు అమ్ముతున్నారు. రేషన్ షాపుల వద్ద పాగా వేసి వారు తీసుకున్న వెంటనే దళారులు కొని దాన్ని నిలువ చేస్తూ ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ఏ అధికారి కూడా తనిఖీలు నిర్వహించకుండా తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నట్లు పరువు మేధావులు చర్చించుకుంటున్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వం రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ దానిని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.అధికారులకు ఈ విషయం తెలిసిన కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరించడం ప్రశ్నార్థకంగా మారింది. గత కొద్ది రోజులుగా ఇదే తంతు జరుగుతున్న స్థానికంగా ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india