ఎంపీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ ఆయా పార్టీల నాయకులు ప్రచారాలు జరుపుతున్నారు. అయితే ప్రచార కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి రుద్రూర్ మండల కేంద్రంలోని నాయకులతో కలిసి నిప్పులాంటి ఎండలో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లారు. రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా ఉన్న బిజెపి నిరంకుశ పాలనకు చెక్మెట్ పెట్టే రోజులు దగ్గర అయ్యాయని,వేరే పార్టీ లు మతాల పేరీట రాజకీయాలు చేస్తూ పేదల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, అభివృద్ధి మీద మాట్లాడి అభివృద్ధి దిశగా ప్రజలను తీసుకెళ్లే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టని రాష్ట్రవ్యాప్తంగా ఎ విధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందో రానున్న రోజులో దేశవ్యాప్తంగా హస్తం జెండా ఎగరవేయడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం రుద్రూర్ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








