బీర్కూర్ మండలం: మండలం లో గల అన్నారం, దామరoచ గ్రామాల్లో ఆదివారం రోజు బిజెపి బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మి నారాయణ సమక్షంలో 30 మంది యువకులు బిజెపి పార్టీలో చేరారు . పార్టీ కండువాలు కప్పి వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువకులు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి బిజెపి పార్టీలోకి చేరడం దేశాభివృద్ధికి శుభ సూచకం అని అన్నారు. ఇదే స్ఫూర్తితో దేశంలోని యువకులంతా ఏకధాటిపైకి వచ్చి బిజెపి పార్టీ గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ చైతన్యవంతులను చేయాలని కోరారు. అనంతరం దామరంచ గ్రామంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ బిజెపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ,సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీబీ పార్టీలను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు నాగేళ్ల సాయి కిరణ్, మండల ఇంచార్జ్ మక్కన్న, ప్రధాన కార్యదర్శి బొంతల శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రవీణ్,పోచ గొండ , రాజు, మోహన్, మనోజ్, సాయిలు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దామరoచ గ్రామంలో యెండల లక్ష్మి నారాయణ నాయకులు, కార్యకర్తల తో కలిసి ఇంటి ఇంటికి తిరుగుతూ బిజెపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








