Post Views: 70
- కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం లో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మండలానికి చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచారు. భాగంగా శ్రీవాణి విద్యాసంస్థల విద్యార్థిని శృతి , గిరిజన గురుకుల బాలుర పాఠశాల విద్యార్థి కె .నితిన్ ఇరువురు GPA 10/10 సాధించి ఘనత కనబరిచారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, పాఠశాల యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, MEO నాగేశ్వరరావు విద్యార్థులను అభినందించారు. గిరిజన గురుకుల బాలుర పాఠశాలల విభాగంలో మెదక్ రీజినల్ లోనే నితిన్ మొదటి స్థానం సాధించడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా RCO సంపత్ నితిన్ కు అభినందనలు తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








