కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బి. ఆర్.ఎస్ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా సోమవారం రోజు జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం, పెద్ద కొడప్గల్, బిచ్కుంద మండల కేంద్రాలలో జరిగిన రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ లలో గాలి అనీల్ కుమార్ తో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు..
.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం అంటే గతంలో వెనుకబడిన ప్రాంతం అని అనుకునేవారు. కానీ హన్మంత్ షిండే శాసనసభ్యుడు అయినప్పటి నుండి నియోజకవర్గంలో అభివృద్ధి మొదలైంది. గత పదేళ్ళ బి.ఆర్. యస్ పాలనలో ప్రతి గ్రామంలో అన్ని రకాలుగా అభివృద్ధి జరిగింది. డెబ్బై ఏళ్ళలో జరగని అభివృద్ధిని షిండే పదేళ్ళలో చేసి చూపించాడు.ఈ ప్రాంతానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేయడానికి నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడానికి బి.ఆర్. యస్ ప్రభుత్వంలో నిధులు మంజూరు చేశారు.
కానీ కాంగ్రెస్ నాయకుల దొంగ హామీలు, అబద్ధాలను నమ్మి ప్రజలు ఆశతో గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి నాయకుడుగా ఉండాలి ,రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు మీకు అందినట్లయితే అందరూ కాంగ్రెస్ కే ఓటు వేయండి లేకపోతే తగ్గిన బుద్ధి చెప్పండని అన్నారు.రైతుబంధు ఎకరాకు రూ. 15,000,
కౌలు రైతులకు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇయ్యలేదు.అదేవిధంగా ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా ఇస్తామన్నారు,కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంలో ప్రస్తుతం ఉన్న లక్షా నూటపదహార్లతో పాటుగా తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్క ఆడబిడ్డకు కూడా ఇవ్వలేదు.డిసెంబర్ 9న ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఇప్పుడేమో ఆగస్టు 15 వ తేది అంటున్నాడు. ప్రజలు నమ్మరని తెలిసి దేవుని మీద ఒట్లు పెడుతున్నాడు. ఒకసారి నమ్మి మోసపోయాము మళ్లీ మోసపోకుండా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి ఎన్నికలలో ఓడించాలన్నారు.ఒకపక్క బీ.జే .పి ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం,
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం, నల్లధన్నాన్ని వెనక్కి తీసుకొచ్చి అందరి ఖాతాల్లో 15 లక్షల చొప్పున జమ చేస్తామని మోడీ ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికి పదేళ్లు గడిచిపోయిన ఏ ఒక్క హామీ అమలు అమలుపరచకపోగా అంబానీ, ఆదాని ,విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లకు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని,
మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. మన ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి పనులు చేయని కాంగ్రెస్ ,బిజెపి నాయకులను ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
పాలిచ్చే బర్రెకు గడ్డి వేస్తే ఉపయోగం ఉంటుంది కాని గొడ్డు బర్రెకు వేస్తే ఉపయోగం ఉండదని ఎద్దేవా చేశారు. గడిచిన 10 సంవత్సరాలలో కెసిఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని, ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని అభివృద్ధి కేవలం బి.ఆర్.ఎస్ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి అనీల్ కుమార్ , బీసీల ముద్దుబిడ్డను మే 13 న జరిగే ఎన్నికల ప్రక్రియలో అందరూ కారు గుర్తుపై ఓటు వేసి BRS పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








