V1News Telangana

best news portal development company in india

ఇసుక అక్రమ దందాపై చోద్యం చూస్తున్న అధికారులు…

SHARE:

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కల్దుర్కి,సిద్దాపూర్,కండ్ గావ్ మరియు సాలూర మండలంలోని హున్స, ఖాజాపూర్ మంజీరా నది పరివాహక గ్రామాలైన ఇక్కడి నుండి కుమ్మన్ పల్లి, సాలంపాడ్, పెంటకుర్దు గ్రామాల మీదుగా ఇసుక అక్రమ రవాణా రాత్రింబవళ్లు తేడా లేకుండా నిరంతరాయంగా కొనసాగుతుంది.

ప్రభుత్వ కాంట్రాక్టు పనుల పేరు వంకగా చూపుతూ అక్రమార్కులు వారి చేతివాటం చూపిస్తున్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో లేనివిధంగా అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ఓవర్ లోడ్ మరియు రోడ్లపై ట్రాక్టర్లు వేగంగా పరుగులు పెడుతూ ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతూ గాయపరుస్తున్నారు. 18 సంవత్సరాలు నిండని వారు, లైసెన్సులు లేకపోయినా ట్రాక్టర్ల ఫిట్నెస్ కాలం ముగిసిపోయిన RTA జాడ కూడా అటువైపు లేదు అని ప్రజలు వాపోతున్నారు. పోలీసులు మొక్కుబడిగా ట్రాక్టర్లను స్టేషన్ కు తరలించి నామమాత్రపు జరిమానాలు విధించి వదిలేస్తున్నారు.

ఇంత జరిగినప్పటికీ సంబంధిత అధికారులు మైనింగ్ శాఖ, రెవిన్యూ శాఖ స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మైనింగ్ శాఖ వారు నిబంధనలు ఉల్లఘించిన వారిపై వాల్టా చట్టాన్ని అమలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రగల్బాలు పలికినప్పటికీ ఇప్పటికీ అమలుపరచడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని స్థానిక బి.ఆర్.ఎస్ నాయకుడు హరికృష్ణ తెలిపారు.

సాలూర మండలం ఏర్పాటైన నాటి నుండి ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు చాలామంది బదిలీ అయినప్పటికీ ఒక అధికారి మాత్రం బదిలీ కాకపోవడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తుందని ప్రజలు వాపోతున్నారు. బోధన్, నాందేడ్ ప్రధాన రహదారిపై గల ఒక పేరుగాంచిన ధాబా హోటల్ రాత్రి పది గంటల తర్వాత మూసివేయాల్సిన హోటల్ తెల్లవార్లు తెరిచి ఉంచుతూ ఇసుక అక్రమ దందా చేసేవారికి కేంద్రంగా అన్ని కార్యకలాపాలు ఇక్కడి నుండే కొనసాగుతున్నాయని ప్రజలు కచ్చితంగా తెలుపుతున్నారు.

ప్రజలపై దాడులు జరిగి గాయాల పాలనప్పటికీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఈ విషయంపై స్పందించి సంబంధిత అధికారులకు ఆజ్ఞాపించి ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india