V1News Telangana

best news portal development company in india

పైసలిస్తేనే దర్గాలో ఎంట్రీ, డబ్బులు ఇవ్వని వారికి దర్గాలో నో ఎంట్రీ…

SHARE:

వర్ని మండల కేంద్రంలోని బడా పహాడ్ దర్గాలో గత సంవత్సరం మూడు కోట్ల 45 లక్షలకు కాంట్రాక్టర్లకు టెండర్ ఇవ్వడం జరిగింది. అయితే కాళ్ల పరిమితి మించిన కాంట్రాక్టర్లు మాత్రం వాక్ బోర్డ్ అండదండలతో భక్తులను భయ ప్రాంతాలకు గురి చేస్తూ వారి వద్ద నుండి వేలలో డబ్బులు నొక్కేస్తున్నారట. డబ్బులు ఇవ్వని వారికి లాక్కొని మరీ తీసుకుంటున్నారట వీలు దర్గా పూజారిలా లేక రౌడీలా అన్నట్టు భక్తులు సైతం ఆరోపిస్తున్నారు. 2023 ఏప్రిల్ 15 నుండి టెండర్ 2024 ఏప్రిల్ 15 తేదీ వరకు టెండర్ సమయం గడిచింది. టెండర్ సమయం గడిచిన ఇంతకుముందు ఉన్న కాంట్రాక్టర్లతోనే వాక్ బోర్డ్ సిబ్బందితోనే పట్టపగలే నిలువు దోపిడీ చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బడాపాహడ్ దర్గా చుట్టుపక్కల గల వారు కోరుతున్నారు. దర్గా హుండీలో తప్పనిసరిగా 500 పైగా డబ్బులు వెయ్యాలని మరి లోపల వెళ్ళిన తర్వాత ఆ దర్గా యాజమాన్యానికి సైతం 500 పైగా డబ్బులు ఇవ్వాలని కండిషన్లు పెడుతున్నారట అక్కడున్న దర్గా ముజావరులు ఈ విధంగా భక్తుల దగ్గర దోచుకుంటే బడా పహాడ్ దర్గాలోని దేవుడు వారిని క్షమించడని పేదవారి పాపం తీసుకుంటే వారు సర్వనాశనం అయిపోతారని కొందరు భక్తులు ఏడుస్తు తమ బాధను తెలుపుతున్నారు. పట్టపగలే బడాపాడు దర్గాలో జరుగుతున్న దోపిడిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేయాలని కాంగ్రెస్ బడా నాయకులు వీటి పైన ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులను ముజవరుల దోపిడి నుండి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india