V1News Telangana

best news portal development company in india

ప్రశ్నిస్తే చంపేస్తారా అమాయకులపై ఇసుక మాఫియా రాయుళ్ల రాడ్లతో దాడి..ఇసుక తరలిస్తు ఓవర్ లోడ్ ఎందుకు వెళ్తున్నావ్ అని ప్రశ్నించగా ఇంటికి వచ్చి దాడి చేసిన ఇసుక మాఫియా రాయులు…..

SHARE:

బోధన్ మండల కేంద్రంలోనీ నాగంపల్లి బ్రిడ్జి వద్ద ఇసుకతో నింపుకొని వెళ్తున్న లారీ అతివేగంగా వెళుతూ బైకుపై వెళ్తున్న వాహన దారులను ఓవర్టేక్ చేసింది. అతి వేగంగా ఎందుకు వెళ్తున్నావ్ అని ఆ బైకుపై ఉన్న వాహనదారులు ఇసుక లారీని ఆపి అడిగితే వారు అదే రోజు రాత్రి సమయంలో బైక్ వాహనదారుడైన అర్బజ్ ఖాన్ ఇంటికి 25 పైగా మంది వచ్చి రాడ్లతో దాడి చేశారని ఈరోజు బోధన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు .

కక్షపూరితంగా రాత్రి 11 గంటల సమయంలో ఈ విధంగా వచ్చి చచ్చేదాకా దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంతో చెప్పిన స్థానిక బోధన్ పోలీసు అధికారులు తమ గోడును వినిపించుకోవడంలేదని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ అయినటువంటి సింగిన్ వార్ కల్మేశ్వర్ గారు తమకు న్యాయం కల్పించాలని మా ఏరియా ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నాయని ఆ సీసీటీ ఫొటోలు ఓపెన్ చేసి చూస్తే ఎంతమంది ఇంటి మీదకు ఏ విధంగా దాడి చేశారు బోధన్ పోలీసు అధికారులకు కూడా అర్థమవుతుందని, తమకు పోలీసు వ్యవస్థపై నమ్మకం ఉందని ఈ విధంగా ఘోరంగా రాడ్లతో 20 మంది వచ్చి దాడులు చేస్తే ఏ కేసులు పెడతారు ఏ కేసు కింద ఇలాంటి నేరాలు వస్తాయి పోలీస్ అధికారులు సైతం గమనించాలని అర్బజ్ ఖాన్ వాళ్ల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కమిషనర్ కార్యాలయానికి వెళ్లి సిపి గారిని కలిసి తమ సమస్యను వివరిస్తామని, బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. ఇష్టానుసారం దో నంబర్ దందలు చేస్తూ ప్రశ్నించిన వారిపై ఈ విధంగా ఇంటికి వచ్చి 25 మంది దాడులు చేయడం న్యాయమా సమాజమే తమకు న్యాయం కల్పించాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కోరారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india