V1News Telangana

best news portal development company in india

ఉపాధి హామీ పనులు నామ మాత్రానికేనా….?

SHARE:

 

రుద్రూర్ మండల కేంద్రం లోని గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు ఫీల్డ్ అసిస్టెంట్ లను ఇంచార్జి గా బాధ్యత లు అప్పగించి పనులు చేయిస్తున్నారు.మరి ఫీల్డ్ అసిస్టెంట్ లు ఇష్టనుసరం డబ్బులు ఇస్తున్నారని ఎన్ని సార్లు లబోధిభోమన్న పట్టించుకునే నాధుడు కరువైయ్యారు అన్నట్టు స్థానిక ప్రజలు ప్రశ్నిస్తునారు. ఫీల్డ్ అసిస్టెంట్ ల పనులను పై స్థాయి అధికారి పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నాడా, లేదా కలిసి వాటాలు పంచుకుంటారా అర్ధం కావడం లేదంటూ మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి వరకు రుద్రూర్ మండలంలో ఎంత మంది ఉపాధి హామీ కూలీలుగా వెళ్తున్నారు ఎంత మంది ఇంట్లో నే నిద్రపోతు డబ్బులు ఖాతాలో జామ చేయిస్తున్నారో పై స్థాయి అధికారులు తెలుసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అసలు ఒక గంట పోయి కూర్చొని వస్తున్నారా లేదా పనులు జరుగుతున్నాయా అనేది కోటి రూపాయల ప్రశ్న. నిజామాబాదు జిల్లా స్థాయి అధికారులు రుద్రూర్ మండలం లో జరుగుతున్న ఉపాధిహామీ పనుల పై ప్రత్యేక ద్రుష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india