V1News Telangana

best news portal development company in india

కదిలిన అధికార యంత్రాంగం స్పందించిన ఎంపీడీవో…  ఉపాధి హామీ పనులపై పై స్థాయి అధికారుల నిఘా…

SHARE:

 ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని నిన్న v1 న్యూస్ ఛానల్ లో ప్రచురితమైన వార్తకు స్పందించి రుద్రూర్ ఎంపీడీవో సురేష్ బాబు తమ సిబ్బందితో కలిసి రాయకూర్ గ్రామానికి వెళ్లారు. సత్య అసత్యాలను గ్రహించి ప్రజలకు మేలు కలిగేల తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా చూస్తామని రుద్రూర్ ఎంపీడీవో చెప్పినట్టు స్థానికులు తెలిపారు. ప్రజలకు సమస్య వచ్చిందని వార్త రావడంతో ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రజల వద్దకు వచ్చిన ఎంపీడీవో ను రాయకూర్ గ్రామస్తులు అభినందిస్తున్నారు. అదేవిధంగా రుద్రూర్ మండల కేంద్రంలోని ఇతర గ్రామాలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల పైన రుద్రూర్ ఎంపీడీవో ప్రత్యేక దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india