కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం 2 గంటల30 నిమిషాలకు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వర్ని మ్యాట్రిక్స్ స్కూల్లో చదువుతున్న అలేఖ్య (14), అమూల్య (14) వారి సమీప బంధువు సుభాష్ రెడ్డి (35) సంవత్సరాలు, పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ద్విచక్ర వాహనంపై వర్ని నుండి స్వగ్రామం కంగ్టి వెళ్లేటప్పుడు మార్గం మధ్యలో దుర్కి గ్రామ శివారులో బాన్సువాడ నుండి బోధన్ వైపు వెళుతున్న కారు అదుపుతప్పి ఢీకొట్టడంతో బైక్ పైన ఉన్న ఇద్దరు అమ్మాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారు నడిపిన వ్యక్తి ముత్యాల విశాల్ ( 21) అంగర్గ గ్రామం, పోతంగల్ మండలానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. ఘటన స్థలాన్ని ఎస్సై లావణ్య పరిశీలించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








