V1News Telangana

best news portal development company in india

ప్రమాదాలు సంభవిస్తే గాని మరమ్మతులకు నోచుకోని రోడ్డు మార్గాలు….

SHARE:

V1 న్యూస్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణ సమీపంలో ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వర్షాలు కురిసినప్పుడు గుంతలలో నీళ్లు నిలిచిపోయి వాహనదారుల రాకపోకలకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు వాపోతున్నారు, గతంలో ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పడిపోయి బాధితులు గాయాల పాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం పట్ల ప్రజలు అసహనానికి గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేయించవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india