V1News Telangana

best news portal development company in india

రైతుల ఆందోళన పై స్పందించిన సంబంధిత శాఖ అధికారులు….

SHARE:

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల సొసైటీ పరిధిలో గల బరంగేడిగి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పనిచేసే సిబ్బంది ఆకస్మాత్తుగా వడ్ల కొనుగోలు నిలిపివేశారు. సిద్ధి వినాయక ఇండస్ట్రీస్ లో వరి ధాన్యం తూకంలో జరిగే లోపాల గురించి మరియు ఎటువంటి కారణాలు లేకుండా కాంట నిలిపివేయడం పట్ల రైతులు ఆగ్రహం చెంది ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై స్పందించిన సంబంధిత అధికారులు డి.సి.ఎస్.ఒ మల్లికార్జున్ బాబు, సివిల్ సప్లై కార్పొరేషన్ డి .ఎం నిత్యానంద్, సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ డి.టి సురేష్ బాబు ఆదివారం రోజు సంఘటనా స్థలానికి చేరుకొని సిద్ధి వినాయక ఇండస్ట్రీస్ మరియు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. ఎవరి అనుమతితో కాంటా నిలిపివేశారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూకంలో వచ్చిన లోపాల గురించి విచారించగా మరమ్మతుకు గురైందని సిబ్బంది తెలియజేశారు ఈ సందర్భంలో అధికారులతో పాటు రైతులు స్థానికులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india