V1News Telangana

best news portal development company in india

బాన్సువాడ మరియు బీర్కూరు మండలంలో బిజెపి బైక్ ర్యాలీ రోడ్ షో….

SHARE:

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో మరియు బీర్కూర్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు మండలాల, గ్రామాల ప్రజలు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో దేశం ఆర్థికంగా మరియు సాంకేతికంగా అభివృద్ధి చెందిందని సంక్షేమ పథకాలు కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా అందించారని అన్నారు. 370 ఆర్టికల్ రద్దు, ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో మరియు 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టి మన భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలల చాటిన గొప్ప మహనీయుడని కొనియాడారు. దేశంలోని రైతులందరికీ ఆర్థిక సహాయం, మహిళల అభివృద్ధికి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు, రాష్ట్రాలలో హైవే రోడ్ల విస్తరణ మరియు రైల్వే సంస్థ అభివృద్ధి, పట్టణాల సుందరీ కరణ, సాంకేతిక అభివృద్ధి వంటి ఎన్నో కార్యక్రమాలు చేశారన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కులు వినియోగించుకొని మరొక్కసారి బిజెపి పార్టీని గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే మోచే గంగారం మరియు జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు, బాన్సువాడ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు, పెద్దలు, యువకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india