V1News Telangana

best news portal development company in india

పలు వివాహాది శుభకార్యాలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన పోచారం భాస్కర్ రెడ్డి….

SHARE:

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లో పలు వివాహాది శుభకార్యాలకు బి. ఆర్.ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని జి ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి కుమార్తె ధరణి వివాహానికి హాజరై నూతన వధూవరులు ధరణి మరియు రోహిత్ రెడ్డి లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీనా గార్డెన్లో బాన్సువాడ పట్టణ వాస్తవ్యులు వాన్కార్ రమేష్ గారి కుమార్తె హాసిని వివాహానికి హాజరై హాసిని మరియు కళ్యాణ్ లను ఆశీర్వదించారు. తర్వాత అక్కడి నుండి బయలుదేరి నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామానికి చెందిన ధూళి లింగమయ్య కుమారుడు సతీష్ వివాహానికి హాజరై నూతన వధూవరులు సతీష్ మరియు వసంత దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభకార్యాలలో పాల్గొన్న సందర్భంలో ఆయన వెంట నియోజకవర్గ నాయకులు ,ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఉన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india