V1News Telangana

best news portal development company in india

నకిలీ విత్తనాల దుకాణం ముందు ఆగ్రహంతో నిరసన తెలిపిన బాధిత రైతులు…..

SHARE:

నకిలీ విత్తనాల దుకాణం ముందు ఆగ్రహంతో నిరసన తెలిపిన బాధిత రైతులు…..

V 1 న్యూస్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో గల విత్తనాలు మరియు ఎరువులు దొరికే ఒక దుకాణంలో రభీ సీజన్ లో గ్రామానికి చెందిన కొందరు రైతులు వరి విత్తనాలు కొనుగోలు చేసి నాటుకున్నారు. నకిలీ విత్తనాలు కావడం వల్ల పంటకాలం పూర్తయినప్పటికీ కోతకు రాకుండా గింజలు పూర్తిస్థాయిలో ఏర్పడలేదు. తెగుళ్ల కారణంగా ధాన్యం పొల్లుగా తయారైంది . దిగుబడి విషయం దేవుడు ఎరుగు పూర్తిగా పంటనష్టం వాటిల్లిందని ఆవేదనతో, రోధిస్తూ రైతులు పేర్కొన్నారు. గత వారం రోజుల క్రితం ఎరువుల దుకాణ ప్రతినిధులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు , శాస్త్రవేత్తలు వరి పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు .నష్టపోయిన రైతులను అదుకుంటామని సదరు దుకాణం యజమానులు హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహరం చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంతో రైతులు ఆగ్రహానికి గురై శుక్రవారం ఎరువుల దుకాణం ముందు ఆందోళనకు దిగారు . దుకాణానికి తాళం వేసి నిరసన తెలిపారు తమకు తగిన న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india