V1News Telangana

best news portal development company in india

తనిఖీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్….

SHARE:

V1 న్యూస్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం రోజు పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లావణ్య ఆధ్వర్యంలో గండి ప్రాంతంలో రోడ్డుపై ప్రయాణించే వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి.సత్యనారాయణ తనిఖీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విధి నిర్వహణ పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించాలని ఎస్సై మరియు కానిస్టేబుల్ లకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు పరిమితి రూ.50,000 కి మించి డబ్బులను వెంట తీసుకువెళ్లకూడదని సూచించారు. అత్యవసర పరిస్థితులలో వైద్యం నిమిత్తం ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తే సంబంధిత అధికారులకు సరైన ధ్రువపత్రాలను సమర్పించి తీసుకువెళ్లే వె సులుబాటు ఉందని తెలియజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india