V1News Telangana

best news portal development company in india

ఘనంగా కోదండ రాముడి కల్యాణ వైభవం….. V1 న్యూస్ ప్రతినిధి:

SHARE:

ఘనంగా కోదండ రాముడి కల్యాణ వైభవం…..

V1 న్యూస్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ గ్రామంలో గల రామ మందిరంలో గ్రామ ప్రజలందరి సమక్షంలో అందరి సహాయ సహకారాలతో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ అరిగె నారాయణ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు, అమ్మవారికి పట్టుచీర సమర్పించారు. పురోహితులు వేదమంత్రాల సాక్షిగా కళ్యాణానికి సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించి మేళ తాళాలతో, డప్పులు, భజన కార్యక్రమాలతో భక్తిశ్రద్ధలతో రామనామ స్మరణలను పటిస్తూ కోదండ రాముడి కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపాకటాక్షాలు, అనుగ్రహం కలగాలని వేడుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india