బాన్సువాడ : బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలో భాగంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు మోరెల్ స్వప్న శ్రీనివాస్ రావు దంపతులు. అనంతరం ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త శ్రీనివాస్ రావు మాట్లాడుతూ రామాలయంను పుణ: నిర్మాణం కొరకు తన వంతు గా సహాయం చేస్తున్నట్లు తెలిపారు. తనతో పాటు తన శిష్యుడు. గ్రామస్తుడైన ప్రభు గౌడ్ తన ఎకరం భూమి ఆలయాభివృద్ధికి అందించారు అన్నారు . గ్రామం లోని ఉద్యోగస్తులు వివిధ రంగాలలో ఉన్న గ్రామస్తులందరు ఎంతొ కొంత సహాయం గా విరాళాలు అందిస్తే అందరి చేయి ఆలయభివృది కి తొడుపడుతుందన్నారు సకలగుణాభి రాముడు సమస్త మానవాళికి ఆదర్శప్రాయుడు ఆ శ్రీరామచంద్రుడి చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని అన్నారు.. శ్రీరాముడి జీవనశైలి యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమని తెలిపారు..పరిపాలనలో గొప్ప రాజుగా, తండ్రి మాట జవదాటని కొడుకుగా,ఉత్తమ పురుషుడిగా, భర్తగా కష్ట సుఖాలను సమదృష్టితో చూడగలిగే స్థిత ప్రజ్ఞత, కర్తవ్య పాలన, ధర్మనిరతి గల మహనీయుడిగా కోట్లాది మంది భక్తుల హృదయాలలో నిలిచిపోయాడని అన్నారు.. ప్రతి ఒక్కరూ శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని వారి జీవనమార్గాన్ని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దేశాయిపేట్ గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








