V1News Telangana

best news portal development company in india

వడ్డీరేట్లతో వేధింపులు ఇక సాగవు…. ప్రైవేట్ ఫైనాన్స్ యజమానులపై పోలీస్ అధికారులు తనిఖీలు…

SHARE:

నిజామాబాదు సీపీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఫైనాన్స్ ల పై దాడులు నిర్వహించడం జరుగుతుంది.

అధిక వడ్డీలతో ఇష్టానుసారం పర్మిషన్ లేని ఫైనాన్స్ నడుపుతున్న వారిపై స్థానిక ఎస్ఐల ద్వారా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. తనిఖీలు నిర్వహించిన తర్వాత ఫైనాన్స్లో ఎటువంటి గోల్మాల్ జరిగిన అట్టి ఫైనాన్లపై కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా 44 పైగా ప్రైవేట్ ఫైనాన్స్ యజమానుల పైన పోలీసు అధికారులు దాడి చేయడం జరిగిందనీ సమాచారం. ఒక ఫైనాన్స్ దాడి జరుగుతా ఉంటే మిగతా ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్లను పూర్తిగా మూసేసి వెళ్లడం ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఒకవైపు ప్రజల అవసరం తీర్చినట్టే అధిక వడ్డీలు తీసుకుంటూ పేద ప్రజలను ఫైనాన్సర్లు పీడిస్తున్నరనీ కొందరు ప్రజలు తెలుపుతున్నావు. ఫైనాన్స్ యజమానుల దగ్గరే సరైన పత్రాలు లేకపోయిన దర్జాగా డబ్బులు ఇవ్వని వాడి వానాలను సైతం గుంజుకుని వాడి ఇంటి దగ్గర వచ్చి గోడవ చేసే ఇలాంటి ప్రైవేట్ ఫైనాన్స్ లను పూర్తి స్థాయిలో నిలిపివేయాలని, వడ్డీల కు డబ్బులు ఇచ్చే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, కట్టలేని స్థాయిలో ఉన్న వారి దగ్గరకు వెళ్లి వేధించడం ప్రైవేట్ ఫైనాన్స్ యాజమానులకు అలావాటుగా మారిందని స్థానిక ప్రజలు చెబుతున్నారు. నిజామాబాదు జిల్లా పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ సింగెన్వార్ చేస్తున్న పని తీరు ను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india