V1News Telangana

best news portal development company in india

వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని పెంచి పోషిస్తున్న ఉన్నతాధికారులు….

SHARE:

వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని పెంచి పోషిస్తున్న ఉన్నతాధికారులు…

కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల ప్రాథమిక వైద్య కేంద్రం లో MHO విధి నిర్వహణలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఉన్నతాధికారులు అటువైపు తిరిగి చూడకపోవడం వల్ల తన ఇష్టా రాజ్యాంగ సమయపాలన పాటించకుండా విధులకు హాజరవుతున్నాడు.

సోమవారం నాడు గర్భిణీ స్త్రీలు అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా వైద్య సేవల కొరకు ఆసుపత్రికి వచ్చి డాక్టర్ లేకపోవడం వల్ల పడిగాపులు కాస్తున్నారు. జ్వరం మరియు ఇతర సమస్యలతో ప్రజలు ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు అందకపోవడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఇంత జరిగినా ఉన్నతాధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల సిబ్బంది ప్రవర్తన లో ఎటువంటి మార్పులు రావడం లేదు. దీన్ని బట్టి చూస్తే ఉన్నతాధికారులు క్రింది స్థాయి సిబ్బందికి ప్రోత్బలం ఇవ్వడం వల్ల వారు ఇలా ప్రవర్తిస్తున్నారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం v1 న్యూస్ ప్రతినిధి సిబ్బందితో డాక్టర్ ఎక్కడ ఉన్నారు అనగా మేము ఉన్నామంటూ సమాధానం చెప్పడం విడ్డూరం.

ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు సకాలంలో వైద్య సేవలు సక్రమంగా అందే విధంగా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india