Post Views: 108
నస్రుల్లాబాద్: మండల పరిధిలో గల ప్రతి గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీవో నీలావతి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు నీటి వసతిని కల్పించాలని పైపులైన్లు లీకేజీ ఉన్నచోట మరమ్మతులు చేయాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భాగంగా ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రాము పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








