V1News Telangana

best news portal development company in india

ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ…..

SHARE:

బాన్సువాడ (కామారెడ్డి) బాన్సువాడ పట్టణ కేంద్రంలో సోమవారం నాడు జహీరాబాద్ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని తెలంగాణ మాజీ శాసనసభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు . ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ,మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తూ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అబద్ధాలు చెబుతూ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులు ఇవ్వకుండా ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు అంతా కృషి చేయాలని కోరారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైన్ కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ బాన్సువాడ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india