V1News Telangana

best news portal development company in india

నవీపేట్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం…

SHARE:

నిజాంబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్ లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హాజరు అయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల బిజెపి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని అన్నారు బిజెపిని వడగట్టి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసి చూపిస్తుందని ధీమా ఇచ్చారు . విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అన్నారు మే నెలలో రైతులకు సాగునీరు అందిస్తామని అన్నారు.
ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నన్ను ఎంపీ ఎంపీగా గెలిపిస్తే బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైను ప్రారంభిస్తామని అన్నారు. జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని అలాగే పసుపు రైతులకు క్వింటాలకు 15000 రూపాయలు గిట్టుబాటు ధర కలిగేలా చూస్తామని అన్నారు. 2025 వరకు షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని అన్నారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అన్నారు . ఎంపీ అరవింద్ పదవీకాలం ముగిసి ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయని వ్యవసాయ కూలీలకు 400 రూపాయలు ఇస్తాం అలాగే గల్ఫ్ కార్మికులు అకాల మరణం చెందితే లక్ష రూపాయలు కాంగ్రెస్ ఇచ్చింది ఇప్పుడు అధికారంలోకి వస్తే ఐదు లక్షల అందిస్తాం విద్యా ఉద్యోగాలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం ఇండియా కూటమి గెలిస్తే దేశవ్యాప్తంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో నవీపేట్ ఎంపీపీ సంఘం శ్రీనివాస్ ఎంపిటిసి సతీష్ పలువురు బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్కెల నరసారెడ్డి. సునీల్ రెడ్డి. తాహెర్ బిన్ హందాన్. మరియు నవీపేట్ మండల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్. గోవర్ధన్ రెడ్డి. సంజీవరెడ్డి. ఎస్.కె మూస తదితరులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india