V1News Telangana

best news portal development company in india

ఇందిరమ్మ ఇళ్లని పట్టించుకునే నాధుడే లేడా

SHARE:

నిజామాబాద్ జిల్లాలోని బోధన పట్టణంలో పది సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ఇల్లు కట్టించిన విషయం అందరికీ తెలిసినదే కానీ వాటిపై అధికారుల దృష్టి ఇంతవరకు పెట్టకపోవడం అనేది పలు అనుమానాలకు దారితీస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అహిహాము వచ్చిన తర్వాత కూడా ఇందిరమ్మ ఇల్లు పట్టించుకోకపోవడం అనేది ఎంతవరకు సమంజసం అక్కడ ఉన్న జనాలకు శుభ్రత లేకుండా ఉండడం. చుట్టుపక్కల శుభ్రత చేయకుండా చెత్త బళ్ళు రాకపోవడం చుట్టూ గడ్డి చెత్తాచెదారంతో నిండిపోవడం. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ప్రజలు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న అప్పుడు మాత్రమే స్పందిస్తున్నారని తరువాత ఎవరూ పట్టించుకోవడంలేదని డ్రైనేజీ విషయంలో పలుమార్లు అధికారులకు చెప్పగా ఇంతవరకు పట్టించుకోకపోవడం వల్లే ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. నీరు వదిలే వాటర్ ట్యాంకు వద్ద చుట్టూ చెత్తాచెదారం పరిశుభ్రమైన నీరు ఇవ్వడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుందని ఇకనైనా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని దీనిపై చర్యలు తీసుకొని ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india