V1News Telangana

best news portal development company in india

ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ…..

SHARE:

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దావఖాన, మాతా శిశు ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ శనివారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని అన్నారు. ఆసుపత్రిలోని వార్డులలో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. చికిత్స కొరకు ఆసుపత్రికి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని వారితో స్నేహపూరితంగా వ్యవహరించాలని వైద్యులకు సూచనలు చేశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యన్ని సక్రమంగా నిర్వర్తించాలని ముఖ్యంగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ కు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి సిబ్బందికి ఇన్ఫెక్షన్ కంట్రోల్ పై శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ కు ఆయన సూచించారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం రోగులకు భోజనం అందించాలని, శిధిలావస్థకు చేరుకున్న ఆసుపత్రి భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో నూతన భవన నిర్మాణాలను చేపట్టాలన్నారు. చికిత్స కోసం వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలిక భవనాన్ని సిద్ధం చేసుకోవాలని సూపరిండెంట్ కు సూచించారు. ఐస్ ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india