V1News Telangana

best news portal development company in india

నకిలీ విత్తనాల బాధితుల వినతి పత్రం…..

SHARE:

బాన్సువాడ ( కామారెడ్డి),
బీర్కూరు మండల కేంద్రానికి చెందిన రైతులు వేసంగి పంట నాట్లు వేయడానికి తీసుకున్న విత్తనాల వల్ల పంట యొక్క కాల పరిమితి అయినప్పటికీ నకిలీ విత్తనాలు కావడం వల్ల పంటలో సరిగ్గా ఎదుగుదల రాకపోవడం వల్ల వడ్లు పొల్లుగా మారాయి అని , తెగుళ్లు రావడం వల్ల పంట మొత్తం నాశనం అయిపోయింది అని వారు తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందించి తెలియజేశారు. ఈ పంటకు గాను మేము పెట్టుబడి ఎకరానికి 35000 చొప్పున ఖర్చు చేసిన ఫలితం లేకుండా పోయింది అన్నారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతుల ఆవేదనను అర్థం చేసుకొని సదరు కంపెనీతో చర్చలు జరిపి మాకు తగిన న్యాయం జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india