V1News Telangana

best news portal development company in india

జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులు

SHARE:

కామారెడ్డి జిల్లా,
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ పార్టీ మండల నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో ఈ రోజు స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి 117 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆయన దళిత వర్గంలో జన్మించినప్పటికీ చదువు అనే ఆయుధంతో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి, చాలా పదవులు పొందాడు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ ,MPP పాల్త్య విట్టల్, జడ్పిటిసి జన్ను బాయ్ ప్రతాప్ సింగ్, రాము ,BRS నసురుల్లాబాద్ గ్రామ అధ్యక్షుడు కంది మల్లేష్, యువజన విభాగం మండల అధ్యక్షుడు బొడిగె భాను ప్రకాష్ గౌడ్, చుంచు పెద్ద సాయిలు, ఖలీల్, మైస గౌడ్, టేకుర్ల సాయిలు, మామిడి భూమయ్య, మోసిన్, వనం వెంకటేశ్వరరావు, రాంబాబు, చంద్రశేఖర్ గౌడ్, దేశ్ పాక్ సాయిలు, భక్కి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india