V1News Telangana

best news portal development company in india

రోడ్లపై వడ్ల ఆరబోత ప్రమాదాలకు కూత

SHARE:

నసురుల్లాబాద్ (బాన్సువాడ) : వేసంగి పంటకు సంబంధించిన వరి కోతలు మొదలైనవి కాబట్టి రైతులు వడ్లను తారు రోడ్డుపైన ఆరబోస్తున్నారు తద్వారా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఒకవైపు ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వ మద్దతు ధర కంటే దళారులు అధిక ధరకు కొనుగోలు చేయడం వలన రైతులు దళారులకు విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారు అందువల్ల వడ్లను ఆరబెట్టి అమ్మితే అధిక ధర పలుకుతుందన్న ఉద్దేశంతో రైతులు రోడ్లపైనే ఆరబోస్తున్నారు ధాన్యం రోడ్లపైన ఆరపోయడం వలన గతంలో రోడ్డు ప్రమాదాలు చాలా సంభవించినాయి, బైక్ పై ప్రయాణిస్తున్న వాహనదారులు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. అంకోల్ క్యాంపు నుండి హాజీపూర్ వెళ్లే రహదారి నూతనంగా నిర్మించింది కాబట్టి లోపలి వైపు గ్రామాల రైతులు రోడ్డుకు ఇరువైపులా వడ్లను ఆరబోస్తున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశాలున్నాయని వాహనదారులు వాపోతున్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india