V1News Telangana

best news portal development company in india

రైతుల కొంపముంచిన గ్రోమోర్ వరి విత్తనాలు

SHARE:

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో గల రైతులు గ్రామంలోని గ్రోమోర్ సెంటర్లో ఆర్కే మసూరి వరి విత్తనాలను కొనుగోలు చేశారు ఆ విత్తనాల పంట యొక్క కాలవ్యవధి 120 రోజులు కాగా వ్యవధి గడిచినప్పటికీ ఇప్పటికీ పంట చేతికి రాకపోగా నకిలీ విత్తనాలు కావడంవల్ల మొక్క సరిగ్గా ఎదగక తెల్ల కంకి రూపంలో (పొల్లు) ఏర్పడి పంట నష్టం జరిగిందని రైతులు తెలియజేశారు ప్రభుత్వ అధికారులు మా యొక్క పొలాలను సందర్శించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఒకపక్క నకిలీ ఎరువులు మరియు నకిలీ విత్తనాలు మార్కెట్లో చలామణి అవుతున్న వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం నామమాత్రపు చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటివి పునరావృతం అవుతున్నాయని వారు హెచ్చరించారు ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మే సంస్థలపై కొరడా ఝలిపించి రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india