V1News Telangana

best news portal development company in india

ఈద్ కా తోఫా కోసం షకీల్ అమీర్ ఇంటికి ఎదురుచూపులు… రంజాన్ నెలలో బోధన్ పేదల ప్రజల కు గుర్తొచ్చేపేరు షకీల్ అమీర్……

SHARE:

సంవత్సరానికి ఒక్కసారి ఇస్లాం ధర్మంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగ రంజాన్. రంజాన్ పండుగకు ముందు నెల రోజులు ముస్లిం సోదరులందరు ఉపవాసాలు ఉంటారు.

రంజాన్ నెలలో బోధన్ పేద ప్రజల కోసం ప్రతి సంవత్సరం బోధన్ మాజీ శాసనసభ్యులు షకిల్ అమీర్ ఇంటి నుండి తోఫాలు ఇస్తారు. ఎంతో మంది వేల ప్రజలకు రంజాన్ పండుగకు అవసరమయ్యే నిత్యవసర సరుకులను అందజేస్తారు. అయితే ఈ సంవత్సరం బోధన్ లోని పేద ప్రజల చూపు షకీల్ అమీర్ ఇంటిపైన ఉంది ఆయన ఎప్పుడొస్తారు ప్రజలకు తోఫాలు ఎప్పుడు ఇస్తారు అని ఎదురుచూపులతో బోధన్ ప్రజలు వేచి చూస్తున్నారు.

రాజకీయాన్ని పక్కన పెడితే రంజాన్ నెలలో పేద ప్రజలను ఆదుకునే దైవంలా షకీల్ అమీర్ గారు ముస్లిమ్ సోదరులకు సోదరీమణులకు ఈద్ కా తోఫా పేరిట పండుగకు అవసరమయ్యే సరుకులను ఇచ్చి వారి అవసరాన్ని తీర్చేవారు. ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజలకు రంజాన్ పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది షకీల్ అమీర్ ఇళ్ళు ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన ఈద్ కా తోఫాలు పంచడం అంత సులభం కాదు. ఇంకా కొన్ని రోజులే రంజాన్ పండుగకు సమయం ఉంది ప్రజలు షకీల్ అమీర్ కోసం వెచ్చిస్తున్నారు. మాజీ శాసనసభ్యులు షకిల్ అమీర్ గారు మరియు ఆయన సతీమణి అయేషా ఫాతిమా అమీర్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈద్ కా తోఫా బోధన్ పట్టణంలోని తన ఇంటి వద్ద ఇచ్చేవారు. మరి ఈ సంవత్సరం బోధనలోని పేద ప్రజలకు ఈద్ కా తోఫా ఇవ్వడానికి షకీల్ అమీర్ గారు వస్తే తమ పండుగ సుఖసంతోషాలతో జరుగుతుందని ఆశ తో ఉన్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

best news portal development company in india