V1News Telangana

best news portal development company in india

నెమ్లీ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీబీ పాటిల్

SHARE:

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో గల తెలంగాణ శిరిడిగా వెలుగొందుతున్న సాయిబాబా ఆలయంలో బిజెపి జహీరాబాద్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి అయినా బీబీ పాటిల్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పంచముఖ శివలింగ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా రెండవ రోజైన ఆదివారం రోజు గణపతి పూజ , జలాధివాసంగ హోమాలు, మూల మంత్ర హోమములు, మహాస్నపనం, ధాన్యాధివాసము, ప్రసాద సంస్కారం ,ఫల పుష్ప శయ్యధివాసం, న్యాసహోమాలు, లఘు పూర్ణాహుతి, మహా హారతి, తీర్థ ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమాలు ఆలయ కమిటీ చైర్మన్ పట్లోళ్ల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి అయినా బీబీ పాటిల్ మరియు బాన్సువాడ నియోజకవర్గ భాజపా ఇన్చార్జి మాజీ శాసనసభ్యుడు ఎండల లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ఆయనకు పూర్ణాహుతితో ఘన స్వాగతం పలికారు అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ పట్లోళ్ల మోహన్ రెడ్డి బీబీ పాటిల్ ను శాలువాతో సన్మానించి సత్కరించారు, పండితులు ఆ పరమశివుడి మరియు సాయినాధుడి యొక్క ఆశీస్సులతో ఆయన రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ అర్చన కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా ఆయన వెంట నియోజకవర్గ బిజెపి నాయకులు చండూరి హనుమాన్లు , గుడుగుంట్ల శ్రీనివాస్ , మండల అధ్యక్షుడు సున్నం సాయిలు , గంగాధర్ గుప్తా , హనుమాన్లు యాదవ్ ,వడ్ల సతీష్, కంది పెద్ద మల్లేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india