Post Views: 84
నసురుల్లాబాద్ గ్రామ శివారులో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నసురుల్లాబాద్ గండి ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టులో శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా సంగారెడ్డి జిల్లా ఉట్నూర్ గ్రామానికి చెందిన శ్రీపతి అనే వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్నటువంటి 66000 రూపాయలు పోలీసులు పట్టుకొని జప్తు చేశారు ఈ సందర్భంగా ఎస్సై లావణ్య మాట్లాడుతూ ఎన్నికల కోడ్ కొనసాగుతుంది కాబట్టి ప్రజలుఎటువంటి ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తంలో 50 వేలకు మించి డబ్బులను నగదు రూపంలో తీసుకొని ప్రయాణం చేయకూడదని ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించకూడదని ఒకవేళ ఎవరైనా విస్మరిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా తెలియజేశారు
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








