నసురుల్లాబాద్ మండలంలోని నెమలి గ్రామంలో గల తెలంగాణ షిర్డీ సాయిబాబా ఆలయంలో శ్రీ పంచముఖ శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమాలు శనివారం రోజున వైదిక నిర్వహణ వైదిక వేద స్మార్త జ్యోతిష్య చండీ ఉపాసకులు నారాయణఖేడ్ నివాసులు యలమంచి గురురాజ శర్మ ఆధ్వర్యంలోఅంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా యాగ సంకల్ప గణపతి పూజ సర్వతోభద్ర మండల స్థాపన యంత్రాలకు జప అని స్థానం జలాధివాసం హోమం లఘు పూర్ణాహుతి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం రోజు యాగశాలహిత ఆవాహిక దేవత ప్రాతః కాల పూజ జలాధివాస సంఘ హోమాలు మహన్నపవనం స్పర్శ నేత్ర మిలనము ధ్యాన దివాసము, సోమవారం రోజు గణపతి పూజ యాగశాల స్థిత అవాహిత దేవత ప్రాతక్కాల పూజ మూల మంత్ర హోమములు యంత్రస్థాపన మూర్తి స్థాపన ప్రాణ ప్రతిష్ట విశేష అభిషేకము జయాది హోమము మహా పూర్ణాహుతి మహా హారతి బ్రహ్మ కలశ విసర్జనం వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త పట్లోళ్ల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్నాయని ఆలయ కమిటీ సెక్రటరీ వెంకట్రామిరెడ్డి తెలిపారు. భక్తులు ఈ దైవిక కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా జరిపించి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులు కాగలరు
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








