V1News Telangana

best news portal development company in india

బోధన్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా పోశెట్టి, కోటేశ్వరరావు లు..

SHARE:

బోధన్,28 మార్చి బోధన్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా పోశెట్టి, కోటేశ్వరరావు లు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు హన్మంత్ రావు, రవీందర్ లు ప్రకటించారు.

గురువారం బోధన్ పట్టణం కోర్టు సముదాయ భవనంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో బోధన్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు ఉత్కంఠ భరితంగా ఎన్నికలు కొనసాగాయి.

నిజామాబాద్ జిల్లా బోధన్ బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి న్యాయవాది సిహెచ్ హనుమంతరావు సమక్షంలో పోలింగ్ కొనసాగింది. బోధన్ బార్ అసోసియేషన్లో మొత్తం 108 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష పదవికి, ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు చొప్పున పోటీలో ఉండటంతో పోలింగ్ అనివార్య మయ్యింది. అధ్యక్ష పదవి కోసం వెంకటేశ్వరరావు దేశాయ్, ఈ.పోశెట్టి లు పోటీలో కొనసాగుతున్నారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం ఎస్ఎస్ఆర్.కోటేశ్వరరావు, ఎన్.ఈశ్వర్ ల మధ్య పోటీ కొనసాగింది. ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, గ్రంథాలయ సెక్రటరీ పోస్టులకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఆ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏడుగురు సభ్యులను కార్యనిర్వహణ కమిటీ సభ్యులుగా ఇది వరకే ఎన్నుకోవడం జరిగింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india