V1News Telangana

best news portal development company in india

చేపలు దొంగతనం చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గంగపుత్రుల సంఘం నాయకులు

SHARE:

చేపలు దొంగతనం చేస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గంగపుత్రుల సంఘం నాయకులు బుధవారం బోధన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాండు చెరువు, చెక్కి చెరువులలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి చేప పిల్లలను వదులుతున్నామని వాటిని పెంచి పెద్ద చేసేందుకు అష్ట కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు వలలు వేసి దొంగతనంగా చేపలు పట్టుకు వెళ్తున్నారని దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. తక్షణమే చేపలు దొంగతనం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు పోలీస్ అధికారులను కోరారు. సంఘ సభ్యులం అందరం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కాపలాదారులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం ప్రతినిధులు భూమయ్య, సుల్తాన్ సాయిలు గంగ పుత్రులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india