V1News Telangana

best news portal development company in india

రైతులకు ఎకరాకు 25 వేలు నష్టపరిహారం అందించాలి.

SHARE:

 బిఆర్ఎస్ పార్టీ నేత శివ సాయి పటేల్.రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే పంట నష్టం వాటిలిన రైతులకు నష్టపరిహారం కింద ఎకరా చొప్పున 25 వేల రూపాయలను అందించాలని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శివ సాయి పటేల్ డిమాండ్ చేశారు.ఇటీవల కురిసిన అకాల వర్షాలకు సాలురా మండలం కుమ్మన్ పల్లి, కొప్పర్తి క్యాంప్ గ్రామల శివారులో రైతు రాంబాబుకు చెందిన నేలనురిగిన మొక్కజొన్న పంటను బుధవారం పరిశీలించి రైతులను పరామర్శించారు.గ్రామ శివారులో దాదాపు 100 ఎకరాలలో పంట నష్టం వాటిలిందని ఆయన స్పష్టం చేశారు.వ్యవసాయ అధికారులు నామమాత్రపు సర్వేలు చేసి రైతులను నష్టాల ఊబిలోకి దించకుండా పారదర్శకంగా సర్వే చేసి నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లుసుదర్శన్.పటేల్,శ్రీనివాసరావు,గంగాధర్,రైతులు శ్రీనివాస్ రెడ్డి,కిష్టా గౌడ్,రాజు,సాయి,సిరిగిరి రాజు తదితరులు ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india