V1News Telangana

best news portal development company in india

చెరువులో పడి యువకుడి ఆత్మహత్య

SHARE:

నసురుల్లాబాద్ మండల కేంద్రంలో చెరువులో పడి యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఎస్సై ఆర్ లావణ్య తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఎరుకలి గంగాధర్ (27) అనే మద్యానికి బానిసై ఎలాంటి పని చేయకుండా  తండ్రి మరియు భార్యతో తరచూ గొడవ పడేవాడు. అందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం భార్యతో గొడవ పడి స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు చూసి  కుటుంబీకులకు సమాచారం అందించగా వెంటనే వెళ్లి బయటకి తీయడానికి ప్రయత్నించారు. అప్పటికే మృతి చెందిన అతన్ని చూసి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. తండ్రి ఎరుకలి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతునికి భార్య ఓ కుమారుడు ఉన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india