V1News Telangana

best news portal development company in india

రాష్ట్ర రాజధానిలో “నాగండ్ల”కు సోషల్ సర్వీస్ విభాగంలో గౌరవ డాక్టరేట్ ప్రధానం

SHARE:

విద్యాతత్పరునికి విశిష్ట డాక్టరేట్

విద్యా వ్యవస్థకు మూల స్తంభంగా నిలుస్తున్న వికాస్ రవి కుమార్

పేద విద్యార్థుల సక్సెస్ హృదయ స్పందనగా కళాశాల డైరెక్టర్

రాష్ట్ర రాజధానిలో “నాగండ్ల”కు సోషల్ సర్వీస్ విభాగంలో గౌరవ డాక్టరేట్ ప్రధానం

గోదావరిఖని “ఎడ్యుకేషన్ డైమండ్”గా పలువురిచే ప్రశంసలు

చదువుల “మహర్షి”కి విద్యార్థులు, తల్లిదండ్రులు, లెక్చరర్ల ఘనమైన శుభాకాంక్షలు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం మార్చ్ 15:-

గోదావరిఖని విద్యాతత్పరునికి విశిష్ట డాక్టరేట్ ప్రదానం చేశారు హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ( HOLY SPIRIT CHRISTIAN UNIVERSITY) HSCU బృందం. విద్యా వ్యవస్థకు మూల స్తంభంగా నిలుస్తున్న వికాస్ రవి కుమార్ సమాజంలో నిస్వార్ధంగా చేస్తున్న సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ పొందారు. పేద విద్యార్థుల సక్సెస్ హృదయ స్పందనగా కళాశాల డైరెక్టర్ ప్రాథమిక విద్యాభ్యాసం సింగరేణి పాఠశాలలో 1992వ సంవత్సరంలో పూర్తిచేసి, ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం హుజురాబాదులోని శాతవాహన కళాశాలలో, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వివిధ యూనివర్సిటీలలో పూర్తిచేసి విద్యా విలువలు తెలిసినటువంటి విద్యావేత్తగా మొదటి ఉద్యోగ జీవితం ఒక చిన్న ప్రైవేటు కళాశాలలో క్లర్క్ గా ప్రారంభించి అంచలంచెలుగా ఎదుగుతూ…. అదే కళాశాలను దత్తత తీసుకొని సుమారు 11 సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది విద్యార్థులను లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, పోలీసులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులుగా తీర్చిదిద్ది వారి యొక్క ఉన్నత స్థానానికి మెయిన్ పిల్లర్ గా విద్యా సేవలు అందించిన నాగండ్ల రవికుమార్ వివిధ రంగాల సేవలకు గుర్తింపునిస్తూ గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ చైర్మన్ బిషప్ డాక్టర్ ఆనంద్ కుమార్, యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ మమత, డాక్టర్ అబ్రహం అందించిన గౌరవ డాక్టరేట్ పొందడం పట్ల గోదావరిఖనిలోనే కాకుండా దాదాపు రాష్ట్రమంతటా కూడా హర్శాతిరేఖాలు ఘనంగా వ్యక్తం అవుతున్నాయి. గోదావరిఖని “ఎడ్యుకేషన్ డైమండ్”గా పలువురిచే ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక కళాశాల విషయానికి వస్తే…. విద్యార్థులు, కళాశాల లెక్చరర్స్, సిబ్బంది, తల్లిదండ్రులు, గురువుకి, విద్యారత్నకి, విద్యా డైమండ్, విద్య కుసుమానికి, విద్యా తత్పరునికి, విద్యా మహర్షికి ఘనంగా స్వాగతం పలికి సన్మాన సత్కారాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india