V1News Telangana

best news portal development company in india

త్రాగడానికి నీరు లేదని సులేమాన్ నగర్ గ్రామస్తులు ఆందోళన….

SHARE:

త్రాగడానికి నీరు లేదని సులేమాన్ నగర్ గ్రామస్తులు ఆందోళన….

ఉన్న బోర్లను సరి చేయకుండా వాటిలోని మోటార్లను తీసుకెళ్తున్నారు…

రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో గల కొత్త ఆబాది ఏరియాలో గత ఐదు సంవత్సరాలుగా తమకు కనీసం నీటి సదుపాయం లేదని ఎన్నిసార్లు గ్రామ సర్పంచ్కు చెప్పిన గ్రామపంచాయతీలో ఫిర్యాదులు ఇచ్చిన వారి బాధను పట్టించుకునే నాధుడే కరువయ్యారని సులేమాన్ నగర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన వారు సైతం తమ సమస్యను పట్టించుకోలేదని బాన్సువాడ నియోజకవర్గంలోని నాయకులకు ఎన్నిసార్లు చెప్పిన వారి సమస్యలను పట్టించుకోలేదని సులేమాన్ నగర్ గ్రామస్తులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత సాయి అధికారులు మరియు మండల స్థాయి నాయకులు తమ సమస్యకు పరిష్కారం చేయాలనీ కొత్త అబాది ఏరియాలో కనీస సౌకర్యాలు కల్పించాలని నీటి కొరత ఉండటం వలన ఇంట్లో త్రాగడానికి సైతం నీరు దొరకడం లేదని ఇదేవిధంగా నడుస్తే ప్రజలకు అధికార వ్యవస్థ పైన ఉన్న నమ్మకం అసలుకే ఉండదని సులేమాన్ నగర్ గ్రామస్తులు తెలుపుతున్నారు. సులేమాన్ నగర్ మాజీ సర్పంచ్ మహమ్మద్, షైక్ ఫరీద్, షైక్ మజీద్, అలీం, యూసుఫ్, జహీద్ మొల్సబ్ మరియు ఇతరులు ఈ ఆందోళన కార్యక్రమం లో పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india